ప్రజాస్వామ్యానికి గౌరవం ఇస్తారు కాబట్టే యడ్యూరప్ప రాజీనామా చేశారు: ప్రకాశ్ జవదేకర్

  • యడ్యూరప్ప ప్రసంగం ప్రజల హృదయాలను తాకింది
  • మాకు ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి వచ్చింది
  • అందుకోసం మేము ఏమీ చేయలేదు
  • కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఎమ్మెల్యేలను హోటళ్లలో నిర్బంధించింది
కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి మోదీని అవినీతిపరుడు అనడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీయే అవినీతికి పర్యాయ పదమని అన్నారు. బీజేపీ నేత యడ్యూరప్ప ప్రజాస్వామ్యానికి గౌరవం ఇస్తారు కాబట్టే రాజీనామా చేశారని, శాసనసభలో ఈ రోజు ఆయన చేసిన ప్రసంగం ప్రజలందరి హృదయాలను తాకిందని అన్నారు.

తమకు ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కావాల్సి వచ్చిందని, అయినా అందుకోసం తాము ఏమీ చేయలేదని, అందువల్లే యడ్యూరప్ప రాజీనామా చేశారని ప్రకాశ్‌ జవదేకర్ అన్నారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తమ ఎమ్మెల్యేలను హోటళ్లలో నిర్బంధించిందని అన్నారు. తాము కర్ణాటకలో గెలుపొంది, అతిపెద్ద పార్టీగా అవతరించామని, కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. కాగా, జేడీఎస్‌ను తమ పార్టీకి బీ టీమ్‌ అంటూ రాహుల్ ఆరోపణలు చేశారని, మరి ఆ పార్టీ కాంగ్రెస్‌తో పెట్టుకున్న దానికి అర్థం ఏమిటని ఆయన నిలదీశారు.
Go Back to Shorts
Congress
BJP
Karnataka

More Telugu News